Thursday, November 22, 2012

Dhanurveda Saaram


ధనుస్సు అంటె రెండు భుజములు కలిగి అస్త్రమును ముందుకు తీక్ష్ణముగ విసరగల ఆయుధము. రెండు దళములు కల ఆజ్ఞా చక్రము ధనుస్సుకు చిహ్నము. మనస్సనె అస్త్రమును ఆజ్ఞా చక్రమున నిలిపి ధ్యాన స్థితిని పొంది సహస్రారమనబడు ధ్యేయము వైపు సారించవలెను. ఆట్టి యత్నము మనయందు ఉన్నచొ భగవంతుడు వాయు రూపమున తొడు నిలచి (రావణ సమ్హారములొ వలె) సరి అయిన దారిలొ నడిపి తన సర్వాంతర్యామిత్వమున లయము చెసికొనును.
ఈ ప్రార్ధనలొ శత్రువులు అంటె అజ్ఞాన జనిత విషయ వాసనలు, విఘ్నములు.  అశ్వములు అంటె వివేక వైరాగ్యాలు. వాటిని నడిపె కళ్ళెములు యమ నియమములు. ధనుస్సును పట్టి నిలిపె చెయ్యి ఆసనము. వంగిన దాని భుజములు ఉఛ్వాస నిస్వాసములు, అనగా సమతౌల్యము కల ప్రాణ చలనము. బాణమును ఆకర్ణాంతము లాగుట ప్రత్యాహారము. యెక్కు పెట్టుట ధారణము. గురిపెట్టుట ధ్యానము. విడుచుట సమాధి. అప్పుడు వెలువడె శబ్దము ఓంకారము. బాణము యానము చేయుట తురీయము.
ఈ యత్నము సులభమగుటకు మహనీయులు అనెక సాధనములను తెలిపి ఉన్నారు. అన్నిటికన్న గొప్ప సాధనము మహనీయుల చరణ సాన్నిధ్యము. మన హ్రిదయమందు అట్టి సాన్నిధ్యము కలిగి ఉండుత పరమార్ధ సాధనకు, యజ్ఞార్ధ కర్మకూ మూలము. జై సాయి మాస్టర్.


 జై సాయి మాస్టర్.

1 comment:

  1. Dear DJ,
    this blog is blessed and re-energised by your post. For sometime I have been trying to understand the significance of 'sannidhi' which is in the blog title. You have put is across so succinctly.
    I do not pretend to understand it all. Looking forward to more elaboration in this vein.
    Jai Sai Master

    ReplyDelete